News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్‌లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్‌కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News March 8, 2026
దేశంలో మరో UT ఏర్పాటంటూ వార్తలు.. ఖండించిన కేంద్రం

WBలోని సిలిగుడి కారిడార్ సమీపంలో కొత్త కేంద్ర పాలిత ప్రాంతం(UT) ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఓ వార్త వైరలవుతోంది. ఇందులో బిహార్, బెంగాల్‌లోని 6 జిల్లాలు ఉంటాయంటూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని PIB Fact Check ఖండించింది. కాగా ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాలు సిలిగుడి నుంచే వెళ్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, చైనాకు ఇది సమీపంలో ఉండటంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
News March 8, 2026
అబ్దుల్ అజీజ్ తల్లి మృతి.. MP నివాళి

AP వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ మాతృమూర్తి అన్వర్ జాన్ మృతి తమకు ఆవేదన కలిగించిందని MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో MP దంపతులు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లి అన్వర్ జాన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
News March 8, 2026
మహబూబాబాద్: గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ పోస్టర్ ఆవిష్కరణ

14 ఏళ్లలోపు బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు అందించే HPV వ్యాక్సిన్ పోస్టర్‌ను మహబూబాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. జిల్లావ్యాప్తంగా 6,670 మంది బాలికలు ఈ వ్యాక్సినేషన్‌కు అర్హులుగా ఉన్నారని తెలిపారు. ఆదివారం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, తొర్రూరు, గూడూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


