News February 3, 2025
వరంగల్: గుండెపోటుతో మార్కెట్ వ్యాపారి మృతి

గుండెపోటుతో ఓ వ్యాపారి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన వరంగల్లో జరిగింది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కడారి సదానందం మిర్చి వ్యాపారిగా పని చేస్తున్నారు. ఈరోజు యథావిధిగా మార్కెట్కు వెళ్లాడు. మార్కెట్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు.
Similar News
News October 16, 2025
జగిత్యాల వైద్య కళాశాల సిబ్బందికి సీపీఆర్పై అవగాహన

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల సిబ్బందికి సీపీఆర్పై వైద్య కళాశాల వైద్యులు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సీపీఆర్ చేయడం వలన మానవ శరీరంలో జరిగే మార్పులను వివరించారు. గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడిన వారు అవుతారని అన్నారు. కళాశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
News October 16, 2025
జగిత్యాల: ‘చెల్లని జీవోల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు’

చెల్లని జీవోల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్లమెంట్లో సవరణ లేకుండా, చట్టబద్ధత లేకుండా 42% రిజర్వేషన్ ఇస్తామని బీసీలను మభ్యపెట్టారని పేర్కొన్నారు. ఈనెల 18న చేపట్టిన బంద్కు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఎల్ రమణ, దావ వసంత తదితరులు పాల్గొన్నారు.
News October 16, 2025
రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి: మోదీ

AP: డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుందని ప్రధాని మోదీ అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లతో ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా ఉండేవి కాదని, ఇప్పుడు ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా ఉందని తెలిపారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉందని కర్నూలు సభలో పేర్కొన్నారు.