News November 10, 2024

వరంగల్: గుండెపోటుతో యువకుడు మృతి

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నాపెద్దా అని వయసుతో తేడా లేకుండా ప్రజలు హార్ట్ ఎటాక్‌కు గురై మృత్యువాత పడుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గకు చెందిన పల్లకొండ వినోద్ గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. 30 సంవత్సరాలలోపు యువకుడే కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 14, 2024

హనుమకొండ: శివయ్య శిరస్సుపై జాబిల్లి

image

హనుమకొండలో దక్షిణ కాశీగా పేరుగాంచిన స్వయంభు లింగం శ్రీ సిద్దేశ్వర ఆలయంలో అరుదైన దృశ్యం కనిపించింది. సాయంకాలం సంధ్యా సమయంలో కార్తీక పౌర్ణమి ఘడియల్లో శివయ్య శిరస్సుపై జాబిల్లి విరజిల్లుతున్నట్లు కనిపించింది. పలువురు భక్తులు ఈ దృశ్యాన్ని తమ ఫోన్ కెమెరాలో బంధించారు.

News November 14, 2024

రేపు డయల్ యువర్ ఆర్ఎం : విజయభాను

image

వరంగల్ రీజియన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వరంగల్ రీజన్ పరిధిలో బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు నెంబర్ 9959226056 కి ఫోన్ చేసి రీజియన్ లోని బస్సు సర్వీసులు, ప్రయాణికుల సర్వీసులు మెరుగుదలకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు.

News November 14, 2024

నర్సంపేట: పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి గడువు పెంపు

image

నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పారా మెడికల్ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తు గడువును పెంచినట్లు ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. నవంబర్ 11న దరఖాస్తు చివర తేదీ కాగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నెల 20 వరకు గడువు పెంచినట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత, దరఖాస్తు విధానం తదితర వివరాలకు ఆన్లైన్‌లో చూసుకోవాలని తెలిపారు.