News November 10, 2024

వరంగల్: గుండెపోటుతో యువకుడు మృతి

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. చిన్నాపెద్దా అని వయసుతో తేడా లేకుండా ప్రజలు హార్ట్ ఎటాక్‌కు గురై మృత్యువాత పడుతున్నారు. తాజాగా గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశిబుగ్గకు చెందిన పల్లకొండ వినోద్ గత రాత్రి గుండెపోటుతో మరణించాడు. 30 సంవత్సరాలలోపు యువకుడే కావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 14, 2024

గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లా కేంద్రంలోని ఏబీవీ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, మెడికల్ కిట్, బయోమెట్రిక్ పరికరాలు, సీసీ కెమెరాలను పర్యవేక్షించి, సిబ్బందికి తగిన సూచనలు చేశారు. తరగతి గదుల్లోని బెంచీలపై అతికించిన హాల్ టికెట్ నంబర్లను అత్యంత జాగ్రత్తగా, సక్రమంగా ఉండాలని సూచించారు.

News December 14, 2024

వసతి గృహాలను సందర్శించిన ఎమ్మెల్యే నాయిని 

image

ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన, నాణ్యతపరమైన భోజన సదుపాయాలను ప్రజా ప్రభుత్వం కల్పిస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట 63వ డివిజన్ బిసి బాలుర వసతి గృహాన్ని ఎమ్మెల్యే సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.  

News December 14, 2024

వరంగల్: విషాదం.. రేపు పెళ్లి.. వరుడి తల్లి మృతి

image

గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. WGL కాశిబుగ్గకు చెందిన గుర్రపు రజిని- సమ్మయ్య దంపతుల కుమారుడి వివాహం ఆదివారం జరగనుంది. కాగా పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న రజినికి శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా గుండెపోటు వచ్చి తనువు చాలించింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.