News June 12, 2024

వరంగల్: గ్రంథాలయాల మరమ్మతులకు నిధులు మంజూరు

image

వరంగల్ జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి కలెక్టర్ ప్రావీణ్య శ్రీకారం చుట్టారు. పలు మండల కేంద్రాల్లోని గ్రంథాలయాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం సుమారు రూ.22.19 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో వరంగల్ కేంద్రీయ గ్రంథాలయం, పర్వతగిరి, కరీమాబాద్, రంగశాయిపేట, ఉర్సు, నర్సంపేట, ఖానాపూరం, నెక్కొండ, చెన్నారావుపేట, దుగ్గొండి గ్రంధాలయాలు మరమ్మతుకు నోచుకోనున్నాయి.

Similar News

News October 6, 2024

MLG: ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాల

image

విద్యార్థులు, యువత ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దనసరి సూర్య అన్నారు. తాడ్వాయి మండలంలోని మేడారంలో నిర్వహించిన కరాటే శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తాడ్వాయి అధ్యక్షుడు బొల్లు దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు.

News October 6, 2024

వరంగల్ మార్కెట్ రేపు పున:ప్రారంభం

image

2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు నేపథ్యంలో మార్కెట్ బంద్ అయింది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News October 6, 2024

GREAT.. జనగామ: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

image

ఒకే ఇంట్లో అన్నా చెల్లెలు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్య కొడుకు మహేశ్ కుమార్, కూతురు మౌనికలు ఇటీవల విడుదలైన డీఎస్సీ(SGT) ఫలితాల్లో వరుసగా 5, 15వ ర్యాంక్‌లు సాధించారు. తండ్రి చిన్నప్పుడే చనిపోగా తల్లి బీడీలు చేసి వీరిని చదివించింది.