News April 11, 2025
వరంగల్ గ్రేన్ మార్కెట్లో ధరలు ఇలా..!

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పలు సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు నిన్న ధర రూ.28,500 పలకగా.. నేడు రూ.27వేలకు పడిపోయింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,500 పలకగా.. ఈరోజు కూడా అదే ధర పలికింది. 5531 మిర్చికి కూడా నేడు రూ.9,500 ధర వచ్చింది. సింగిల్ పట్టీకి రూ.23వేలు వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News April 10, 2026
24 గంటల్లో అరెస్ట్ చేయండి: ఎమ్మెల్యే

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం AK తండాలో యువతి మహేశ్వరి హత్య ఘటన కలకలం రేపింది. సామూహిక అత్యాచారం అనంతరం హత్య చేశారనే ఆరోపణలతో ప్రాంతంలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. చట్టం ముందు ఎవ్వరూ మినహాయింపు కాదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News April 10, 2026
వరంగల్: అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’తో పోషకాహారం

జిల్లాలో అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ‘తొలిముద్ద’ పథకాన్ని ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా 919 కేంద్రాల్లో అమలు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, 47,548 మంది చిన్నారులకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పౌష్టికాహారం అందించనున్నారు. ఉదయం అల్పాహారం లేక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు ఈ పథకం ఉపశమనంగా మారనుంది.
News April 9, 2026
వరంగల్: యువతి అనుమానస్పద మృతి..!

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ తండాలో అనుమానస్పదంగా యువతి మృతి చెందింది. తండాకు చెందిన ఓ యువతి ఉరి వేసుకొని ఇంట్లో కనిపించింది. ప్రేమ పేరుతో పర్వతగిరి మండలం రావూరు తండాకు చెందిన నలుగురు యువకులు వేధించి రేప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.


