News February 1, 2025

వరంగల్: చంటి బాబుతో వచ్చి సత్తా చాటిన మహిళా కానిస్టేబుల్

image

కరీంనగర్‌లో జరుగుతున్న మూడో రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీల్లో శనివారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వరంగల్ పోలీస్ బృందానికి చెందిన మహిళా కానిస్టేబుల్ రజియా బేగం తన ఏడాదిన్నర కొడుకును ఇంట్లో వదిలిపెట్టి ఉండలేక తనతో పాటు క్రీడా మైదానానికి తీసుకొచ్చింది. ఈరోజు ఉదయం తన బాబు సమక్షంలో జరిగిన డిస్కస్‌ త్రో ఫైనల్స్‌లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో అధికారులు, తోటి క్రీడాకారులు ఆమెను అభినందించారు.

Similar News

News February 24, 2026

చెరకులో మాంగనీసు లోపాన్ని ఇలా గుర్తించండి

image

మాంగనీసు లోపం తలెత్తిన చెరకు మొక్కల ఆకులపై పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ (లేదా) తెలుపు రంగు చారలు ఈనెల పక్కన కనిపిస్తాయి. ఈనెల మధ్య తెల్లగా మారిన ఆకుభాగాల్లో కుళ్లు మచ్చలు వచ్చి అవి పెద్దవై, ఒకదానితో ఒకటి కలిసిపోయి, చారలు చారలుగా ఆకు నిలువునా చీల్చినట్లుగా కనిపిస్తాయి. మాంగనీస్ లోప నివారణకు ఎకరాకు 2.5 కిలోల మాంగనీస్ సల్ఫేట్‌ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

News February 24, 2026

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 421 పోస్టులు.. అప్లై చేశారా?

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 421 (DVP, AVP, డిప్యూటీ మేనేజర్, Asst. మేనేజర్, Sr. మేనేజర్, మేనేజర్) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA/PGDM, CA/CFA/CMA అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ స్క్రూటినీ, ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

News February 24, 2026

GREAT: మతం కంటే ❤️ మానవత్వమే గొప్పదని నిరూపించారు

image

AP: కులమతాల కంటే మానవత్వం, మంచితనమే గొప్పవని నిరూపించారు ముస్లిం దంపతులు. చిత్తూరు(D) చౌడేపల్లిలో తల్లిదండ్రులు లేని హేమలత అనే చిన్నారిని అబ్దుల్ బాషా, షబీనా చేరదీసి సొంత కూతురిలా పెంచి పెద్ద చేశారు. మంచి విద్యను అందించారు. తాజాగా ఆమెకు హిందూ వరుడితో హిందూ సంప్రదాయంలోనే వివాహం చేశారు. మతసామరస్యానికి ఈ పెళ్లి ఓ ఉదాహరణ అని ప్రజలు కొనియాడుతున్నారు. ముస్లిం దంపతులను ప్రశంసిస్తున్నారు.