News March 21, 2025
వరంగల్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ముందస్తు సమాచారం సేకరించాలి

చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ప్రధాన కర్తవ్యం అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఏమీ జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. రౌడీ షీటర్లు ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News September 16, 2025
భద్రాద్రి: ఆమెకు అభయం

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించనున్నారు. భద్రాద్రి జిల్లాలో 29 PHCలు, 5 UPHCలు, 1 GGH, 5 పల్లె దవాఖానలు, 153 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయి. వీటి పరిధిలో బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనతకు స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 16, 2025
ఖమ్మం: ఆమె ఆరోగ్యమే లక్ష్యం

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో 26 PHCలు, 4 UPHCలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు 10 క్యాంపుల చొప్పున 12రోజుల్లో 120 క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 16, 2025
RRBలో 13,217 పోస్టులు.. ఏం చదవాలి?

RRB 13,217 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 21 ఆఖరు తేదీ. ప్రాథమిక పరీక్షలు NOV-DEC 2025లో, మెయిన్ ఎగ్జామ్ DEC 2025 నుండి FEB 2026లో నిర్వహిస్తారు. ఇప్పటినుంచి ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఉద్యోగం సాధించవచ్చు. అభ్యర్థులు Reasoning, Numerical Ability, Computer Knowledge, General Awareness, English/Hindi Language వంటి విభాగాలపై పట్టు సాధించాలి.