News March 29, 2025
వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.
Similar News
News November 6, 2025
సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్గా పనిచేశారు.
News November 6, 2025
గద్వాల్: చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి

గద్వాల పట్టణంలోని బీడి కాలనీకి చెందిన సలీం స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాడు. గాలం వేస్తుండగా జారి ప్రమాదవశాత్తు రేకులపల్లి వద్ద ఉన్న గుండాల జలపాతంలో పడి గల్లంతయ్యాడు. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. అతడి కోసం అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహన్ని వెలికితీసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తండ్రి మౌలాలీ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News November 6, 2025
పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్.!

మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పుంగనూరుకు బదులు పీలేరు కేంద్రగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు క్యాబినేట్ సబ్ కమిటీ ప్రతిపాదనలు తయారు చేసింది. ముందుగా పుంగనూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వినిపించాయి. కాగా పీలేరులో ఏఏ మండాలలు ఉంటాయో స్పష్టత రావాల్సి ఉంది.


