News March 29, 2025
వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.
Similar News
News November 22, 2025
MDK: రూ.లక్ష ఆదాయం వస్తుంది..!

సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మల్బరీ తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. పట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, రైతులు కొద్దిగా కష్టపడితే ఎకరానికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్పారు. ప్రభుత్వాలు అందిస్తోన్న ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సోమేశ్వర్ రావు తెలిపారు.
News November 22, 2025
SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
News November 22, 2025
ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.


