News March 29, 2025
వరంగల్: చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్!

చనిపోయిన వ్యక్తికి 13 ఏళ్లుగా పెన్షన్ వస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హనుమకొండ జిల్లా హసన్పర్తికి చెందిన రాములు అనే వ్యక్తి పీఆర్ శాఖలో పని చేసి రిటైర్ అయ్యారు. 2012లో రాములు చనిపోయారు. ఆయన స్థానంలో అదే పేరు, తండ్రి పేరు, ఊరి పేరు ఒకటే ఉన్న మరో వ్యక్తిపై ప్రతీ ఏటా లైఫ్ సర్టిఫికెట్ తీస్తున్నట్లు తెలిసింది. బతికి ఉన్న రాములుకు ఆసరా పెన్షన్ రాకపోవడంతో అసలు విషయం బయటపడినట్లు సమాచారం.
Similar News
News November 23, 2025
పవన్ పర్యటనకు పటిష్ట భద్రత: కలెక్టర్

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం ద్వారకాతిరుమల మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ఆదివారం ఆమె ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జేసీ అభిషేక్ గౌడ్‌తో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు.
News November 23, 2025
రేపు ఘంటసాలలో ‘రైతన్నా మీ కోసం’

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ఘంటసాల గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించనున్నారు. టీడీపీ నేతలు ఆదివారం ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. కనపర్తి శ్రీనివాసరావు శాస్త్రవేత్త డా.డి.సుధారాణితో మాట్లాడి ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.
News November 23, 2025
ఏలూరు: ఈనెల 25న విభిన్న ప్రతిభావంతుల క్రీడలు

వచ్చే నెల 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ శాఖ ఏడీ రామ్‌కుమార్ తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ వెట్రిసెల్వి హాజరవుతారని, విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.


