News January 30, 2025

వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

image

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్‌కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్‌పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం

Similar News

News October 21, 2025

విజయవాడలో ఆ స్థలం వినియోగిస్తే లక్షల మందికి మేలు!

image

గుణదలలోని ESI ఆసుపత్రి స్థలం ఆక్రమణలకు గురవుతోంది. మొత్తం 25 ఎకరాల్లో 2 ఎకరాలు ఇప్పటివరకు ఆక్రమణలకు గురైంది. మిగతా 23 ఎకరాల స్థలం ముళ్ళ కంపలు పెరిగిపోయి అడవిని తలపిస్తోంది. ESI విజయవాడ డివిజన్ పరిధి 7 జిల్లాలో 5 లక్షలకు పైగా కార్మికులు బీమా చెల్లిస్తున్నారు. వీరందరికీ వైద్యం అందించేందుకు కనీసం ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులో లేదు. ఈ 23 ఎకరాల స్థలాన్ని అందుకు వినియోగిస్తే బావుంటుంది.

News October 21, 2025

మానవపాడు: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

ఆరోగ్యం బాగోలేక జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మానవపాడులో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ తెలిపిన వివరాలు.. మానవపాడుకు చెందిన ఆనంద్ (26) వృత్తిరీత్యా ట్రాక్టర్ డ్రైవర్. ఆరోగ్యం బాగో లేకపోవడంతో మానసికంగా బాధపడుతూ జీవితంపై విరక్తితో మానవపాడు సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి కన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News October 21, 2025

తిరుపతి జిల్లా స్థాయి యువజనోత్సవాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొనే ఆసక్తిగల వారి నుంచి సెట్విన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జానపద నృత్యాలు, జానపద గీతాలు, జీవన నైపుణ్య విభాగం పోటీలు జరగనున్నాయి. ఈనెల 28న తిరుపతిలోని ఎమరాల్డ్స్ కాలేజీలో పోటీలు జరగనున్నాయి. ఇతర వివరాలకు 8341111687కు సంప్రదించగలరు.