News January 30, 2025
వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్‌కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్‌పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం.
Similar News
News September 18, 2025
విశాఖలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్

విశాఖలో బుధవారం రాత్రి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. వన్ టౌన్, కంచరపాలెం, షీలా నగర్ ప్రాంతాల్లో ఒకే బ్యాచ్ ఏడు చైన్ స్నాచింగ్‌లు చేసి కలకలం సృష్టించింది. ఒకే బైక్ పై ఇద్దరు యువకులు ఈ ఏడు చోట్ల చోరీలు చేసినట్లు సమాచారం. దొంగతనం చేసిన బైక్‌తో స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 చోట్ల జరిగిన స్నాచింగ్‌లో సుమారు 20 తులాల వరకు బంగారు ఉంటుందని చెబుతున్నారు.
News September 18, 2025
Maturity Laws: ఇవి పాటించు గురూ!

* అందరికీ ప్రతీది చెప్పడం మానేయండి. ఎందుకంటే చాలా మంది వాటిని పట్టించుకోరు. బలహీనతలను అస్సలు చెప్పొద్దు
* స్నేహితులను తెలివిగా ఎంచుకోండి. సరైన స్నేహితులే మీ ఎదుగుదలను ప్రోత్సహిస్తారు
* ఏమీ ఆశించకండి. అభినందించడం నేర్చుకోండి
* మీ వంతు కృషి చేయండి. ఫలితమేదైనా స్వీకరించండి.
* ఇతరులను కాకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడంపై దృష్టి పెట్టండి.
* పరిస్థితులకు తగ్గట్లు స్పందించడం అలవాటు చేసుకోండి.
News September 18, 2025
HYD: గోనెసంచిలో మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం

చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గోనెసంచిలో మహిళ మృతదేహం దొరికిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బుధవారం ఆటో డ్రైవర్లు అదుపులోకి తీసుకుని విచారించగా.. నార్సింగి నుంచి చర్లపల్లికి ఆటో బుక్ చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు పశ్చిమబెంగాల్లోని మల్దా రైల్వే స్టేషన్లో దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.