News January 30, 2025
వరంగల్: జక్రియాను విచారించి వదిలేసిన అధికారులు!

పోలీసులకు పట్టుబడిన జమాత్-ఉల్ ముస్లీమీన్- ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరంగల్‌కు చెందిన జక్రియాను విచారించి ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలేశారు. పాకిస్థాన్‌లోని కరాచీలో జమాత్ సంస్థ నడుస్తోంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని వస్తుండగా ఈ నెల 25న చెన్నై ఎయిర్‌పోర్టులో జక్రియా టీం పోలీసులకు పట్టుబడింది. అయితే వారి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని సమాచారం.
Similar News
News February 15, 2025
బీసీల కోసం మోదీ ఏమీ చేయలేదు: మహేశ్ గౌడ్

TG: బీసీల కోసం మోదీ ఏమీ చేయలేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. బీసీ వ్యక్తి బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే తొలగించారని చెప్పారు. బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలపై నానా హైరానా చేస్తున్నారని మండిపడ్డారు. ఓబీసీ అంటూ ప్రచారం చేసుకున్నారే తప్ప వాళ్లకేమీ చేయలేదని విమర్శించారు.
News February 15, 2025
మంత్రి లోకేశ్‌ను కలిసిన విద్యార్థులు

AP: మంత్రి నారా లోకేశ్‌ను ఆయన నివాసంలో వెటర్నరీ విద్యార్థులు కలిశారు. తమ స్టైఫండ్ పెంచాలని మంత్రిని వారు కోరారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా స్టైఫండ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడితో మాట్లాడి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
News February 15, 2025
బొమ్మగాని ధర్మభిక్షం.. మూడు చోట్ల

బొమ్మగాని ధర్మభిక్షం ఉమ్మడి NLG జిల్లాలో మూడు చోట్ల పోటీచేసి ప్రతీ చోటా విజయం సాధించారు. SRPT ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో 1952 ఎన్నికల్లో ధర్మభిక్షం PDF అభ్యర్థిగా పోటీచేసి జీఏరెడ్డి మీద, 1957లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుంచి PDFఅభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి KVరావుపై, 1962లో NLG నుంచి CPI అభ్యర్థిగా పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ రవూఫ్‌పై విజయం సాధించారు.