News March 31, 2025

వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News November 19, 2025

మల్లె కొమ్మ కత్తిరింపులు.. ఈ జాగ్రత్తలతో మేలు

image

మంచి దిగుబడికి మల్లె తోటల పెంపకంలో మొదటి కత్తిరింపు పంట నాటిన ఏడాదికి చేయాలి. ఏటా నవంబర్-డిసెంబర్‌లో పొదను కత్తిరించాలి. కొమ్మలను కత్తిరించడానికి 10 -15 రోజుల ముందు నుంచి నీరు కట్టడం ఆపేయాలి. నవంబర్ చివరి నుంచి జనవరి తొలివారం వరకు కత్తిరింపులు చేస్తే మార్చి నుంచి జులై వరకు పూలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మల్లె మొక్కలన్నీ ఒకేసారి పూతకురావు. రైతు ఎక్కువ రోజులు మల్లెను మార్కెటింగ్ చేసి లాభం పొందవచ్చు.

News November 19, 2025

ASF వయోవృద్ధుల సంరక్షణకు టోల్ ఫ్రీ నంబర్

image

తల్లిదండ్రులను సరిగా పోషించని బిడ్డలపై ఇప్పటి వరకు ASF జిల్లాలో 28 కేసులు నమోదు చేసినట్లు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిలో మార్పునకు కృషి చేస్తున్నామన్నారు. వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం – 2007 ప్రకారం ట్రిబ్యునల్లు పనిచేస్తున్నాయని తెలిపారు. నిరాదరణకు గురైన వయోవృద్ధులు టోల్ ఫ్రీ నం.14567లో సంప్రదించవచ్చని సూచించారు.