News March 31, 2025

వరంగల్: జాతరలో యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి

image

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో నిర్వహించిన గుండా బ్రహ్మయ్య జాతరలో యువకుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఈ ఘటనలో కుంతపల్లి గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సంగెం పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘర్షణలో పాల్గొన్న యువకుల వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News April 4, 2025

అనకాపల్లి జిల్లాకు భారీ బల్క్ డ్రగ్ కంపెనీ

image

AP: అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లిలో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు లారెస్ సంస్థ ముందుకొచ్చింది. రూ.5000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కొత్త ప్లాంట్ ద్వారా ఫర్మంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి స్పెషాలిటీ కెమికల్స్‌ ఉత్పత్తి చేయనుంది. సీఎం చంద్రబాబును కలిసి పెట్టుబడులపై సంస్థ సీఈవో సత్యనారాయణ చర్చించారు.

News April 4, 2025

సంగారెడ్డి: పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి

image

ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు మూడు నెలలు, కూలీలకు రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో పరమేశంకు గురువారం వినతిపత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి నరసింహులు మాట్లాడుతూ.. వేతనాలు ఇవ్వకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

News April 4, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

☞నంద్యాల GGHలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ☞ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించిన మంత్రి BC☞కందనాతిలో పిడుగుపాటుతో బాలుడి మృతి☞బనగానపల్లె ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLAలు☞నందవరం చౌడమ్మ హుండీ ఆదాయం రూ.4.21లక్షలు☞మంత్రి లోకేశ్‌ను కలిసిన ఆళ్లగడ్డ MLA☞కేంద్ర మంత్రికి ఎంపీ శబరి వినతి☞8 మంది ఎస్ఐలకు పోస్టింగులు

error: Content is protected !!