News January 16, 2025

వరంగల్: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరలు, ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొత్తకొండ, ఐనవోలు, ఊరుగొండ ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరగనన్నాయి. అంతేకాకుండా వచ్చే నెల 12 నుంచి మేడారం మినీ జాతర జరగనుంది. ఈ సందర్భంగా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.

Similar News

News November 20, 2025

వరంగల్: ‘బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలి’

image

బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను అందజేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్‌పై సమావేశంలో కోరారు. 2002 ఓటర్ల జాబితాను ప్రస్తుతం ఉన్న జాబితాతో సరిపోల్చుతున్నట్టు తెలిపారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి తొలగింపు, వివరాల సవరణలు జరగనున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు, జెడ్పీ సీఈఓ రామీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News November 20, 2025

సీఎం సహాయనిది పేదలకు ఒక వరం: ఎంపీ కావ్య

image

అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు సీఎం సహాయనిది ఒక వరమని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య అన్నారు. గురువారం నియోజకవర్గ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఎంపీ CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 11 మందికి రూ.6 లక్షల 25 వేల విలువైన చెక్కులను అందజేశారు.

News November 19, 2025

వరంగల్ కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి అభినందనలు

image

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.