News January 16, 2025
వరంగల్: జాతరల సీజన్.. మీరు ఎక్కడికి వెళుతున్నారు!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరలు, ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొత్తకొండ, ఐనవోలు, ఊరుగొండ ఆలయాలకు భక్తులు తరలి వెళ్తున్నారు. అన్నారం దర్గా ఉర్సు ఉత్సవాలు ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరగనన్నాయి. అంతేకాకుండా వచ్చే నెల 12 నుంచి మేడారం మినీ జాతర జరగనుంది. ఈ సందర్భంగా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మీరు ఎక్కడికి వెళుతున్నారో కామెంట్ చేయండి.
Similar News
News February 13, 2025
వరంగల్ మార్కెట్‌లో భారీగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు నిన్నటితో పోలిస్తే నేడు భారీగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,300 పలకగా.. నేడు రూ.14,000కి పెరిగింది. అలాగే 341 మిర్చికి నిన్న రూ.13,550 ధర రాగా.. ఈరోజు రూ.13,500 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి బుధవారం రూ.14,700 ధర రాగా.. ఈరోజు భారీగా పెరిగి రూ.16వేలకి ఎగబాకింది.
News February 13, 2025
WGL: భారీగా పతనమవుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు మళ్లీ పతనమవుతున్నాయి. మంగళవారం క్వింటా పత్తి ధర రూ.7,060 పలకగా.. బుధవారం రూ.6,950కి పడిపోయింది. నేడు మరింత తగ్గి రూ.6,900కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు తెలుపుతున్నారు.
News February 13, 2025
శ్రీ భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి దేవస్థానంలో మాఘమాస గురువారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆలయ అర్చకులు తదితరులున్నారు.