News September 14, 2024

వరంగల్‌ జిల్లాకు రూ.3కోట్లు

image

ఇటీవల కురిసిన వర్షాలు జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టవివరాలను అందజేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో జిల్లాకు రూ.3కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట అంచనా తయారు చేయాలని ఆమె సూచించారు.

Similar News

News December 10, 2025

WGL: పల్లెల్లో ఎన్నికల పండగ..!

image

ఉమ్మడి WGL జిల్లాలో మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం తొలి విడత జరగనుంది. పల్లెల్లో ఎన్నికల పర్వం పండగ వాతావరణం సృష్టించగా, అభ్యర్థుల గుణగణాల మీద చర్చలు జోరందుకున్నాయి. పార్టీ రహితంగా ఎన్నికలు జరుగుతున్నా, అభ్యర్థులు పార్టీ కండువాలతోనే ప్రచారం చేస్తూ ఊర్లో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బయట ఉన్న ఓటర్లకు ఫోన్లు చేసి రానుపోను ఖర్చులు ఇస్తామని చెబుతున్నారు.

News December 10, 2025

WGL: నా గుర్తు స్టూల్.. ఇదిగో నీకో కుర్చీ..!

image

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వార్డు అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారు. మొన్నటికి మొన్న ఓ పార్టీ క్వార్టర్ మందు ఇస్తే మరో పార్టీ అర కిలో చికెన్ ఇచ్చి ఆకర్షించింది. ఇక మరో వార్డు అభ్యర్థి తనకు గుర్తు కుర్చీ కేటాయించడంతో ఏకంగా ఓటర్లకు కుర్చీలను పంచి పెట్టడం వైరల్‌గా మారింది. ఆటోలో ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఓటుకు ఒక్కో కూర్చి ఇచ్చి తన గుర్తు ఇదే అంటున్నాడు.

News December 10, 2025

వరంగల్: ప్రచారం ముగిసింది.. ప్రలోభాలకు వేలయింది..!

image

జిల్లాలో ప్రచారానికి తెరపడడంతో పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వం మొదలైంది. ప్రధాన పార్టీల నేతలు మందు సీసాలు, మటన్, చీరలు, మిక్సీలు, నగదు పంపిణీకి గుట్టుగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెల 11వ తేదీ పోలింగ్‌కు అధికారులు 800 బూత్‌లను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించారు. మఫ్టీలో పోలీసులు పర్యటిస్తూ శాంతిభద్రతలకు చర్యలు చేపడుతున్నారు.