News September 14, 2024
వరంగల్ జిల్లాకు రూ.3కోట్లు
ఇటీవల కురిసిన వర్షాలు జిల్లాలో తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఆ నష్టవివరాలను అందజేయాలని వరంగల్ కలెక్టర్ డా. సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో జిల్లాకు రూ.3కోట్ల నిధులను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్ట అంచనా తయారు చేయాలని ఆమె సూచించారు.
Similar News
News October 13, 2024
హర్యానా గవర్నర్‌ను కలిసిన మాజీ MLA
హైదరాబాద్‌లోని నాంపల్లిలో నిర్వహించిన అలాయ్.. బలాయ్ కార్యక్రమంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు. అనంతరం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను మాజీ ఎమ్మెల్యే కలిసి పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.
News October 13, 2024
MHBD: గన్‌తో కాల్చుకొని AR కానిస్టేబుల్ మృతి
మహబూబాబాద్ కలెక్టరేట్ లో ఆదివారం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న AR కానిస్టేబుల్ శ్రీనివాస్ గన్‌తో కాల్చుకొని మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 13, 2024
వరంగల్: రేపటి నుంచి ఎనుమాముల మార్కెట్ START
4 రోజుల వరుస సెలవులు అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రేపు (సోమవారం) పునఃప్రారంభం కానుంది. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉంది. దీంతో మార్కెట్ రేపు ప్రారంభం కానుండగా, ఉదయం 6 గంటల నుంచే క్రయవిక్రయాలు ప్రారంభం కానున్నాయి.