News December 26, 2024

వరంగల్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

image

క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి వరంగల్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్‌లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.

Similar News

News December 28, 2024

నల్లబెల్లి: అడుగులే పులుల సంచారాన్ని బయటపెట్టాయి!

image

పులుల అడుగుల సైజులతోనే మండలంలో మూడు పులులు సంచరిస్తున్నట్టు అధికారులు నిర్ధారించారు. సాధారణంగా మగ పులి అడుగు పెద్దగా, ఆడపులి అడుగు కొద్దిగా చిన్నగా ఉంటుందని అధికారులు తెలిపారు. రుద్రగూడెంలో పులి అడుగు సైజు 15 నుంచి 20 సెం.మీ కాగా కొండాపురంలో పులి అడుగు 12 నుంచి 15 సెం.మీ, పులి పిల్ల అడుగు 6 నుంచి 8 సెం.మీ ఉండడంతో మండలంలో ఒకటి కాదు మూడు పులుల సంచారం బయటపడింది.

News December 27, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> BHPL: కాటారం మండలంలో వ్యక్తి దారుణ హత్య
> WGL: బైక్ అదుపుతప్పి యువకుడికి గాయాలు
> NSPT: రోడ్డు ప్రమాదంలో B.TECH యువకుడి మృతి.. UPDATE
> WGL: వర్ధన్నపేటలో తృటిలో తప్పిన పెను ప్రమాదం
> JN: ఫీట్ లోతులో గుంత.. ప్రమాదకరంగా ప్రయాణం!
> WGL: ఉరి వేసుకుని యువకుడు సూసైడ్
> HNK: రౌడీ షీటర్లను ఉక్కు పాదంతో అణిచివేయాలి