News March 9, 2025

వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

వరంగల్లో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. విత్‌ స్కిన్ కేజీ రూ.140, లైవ్ కోడి రూ.100 పలుకుతోంది. సిటీకి పల్లెలకు రూ.10-20 తేడా ఉంది. గత 2 వారాల క్రితం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చాలా మంది మటన్‌, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపగా మళ్లీ వారం రోజుల నుంచి చికెన్ అమ్మకాలు పెరిగాయని, షాపు నిర్వాహకులు చెబుతున్నారు.

Similar News

News October 15, 2025

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ల్యాండ్ ఆక్విజిషన్‌పై సమీక్ష

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనుల ల్యాండ్ ఆక్విజిషన్ పురోగతిపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీఓ నర్సంపేట ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 15, 2025

చెక్ లిస్టులు సరి చూసుకోవాలి: డీఐఈఓ

image

జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ప్రథమ, ద్వితీయ సం. విద్యార్థులు తమ వివరాలను సరి చూసుకునే సౌకర్యం కల్పించారని, విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింకు ద్వారా నేరుగా తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు.

News October 15, 2025

ధాన్యం సేకరణకు విస్తృత ఏర్పాట్లు: వరంగల్ కలెక్టర్

image

రైతులు పండించిన ధాన్యం సేకరణ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వెల్లడించారు. బుధవారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.