News March 9, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

వరంగల్, హన్మకొండలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. విత్ స్కిన్ కేజీ రూ.140, లైవ్ కోడి రూ.100 పలుకుతోంది. సిటీకి పల్లెలకు రూ.10-20 తేడా ఉంది. గత 2 వారాల క్రితం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చాలా మంది మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపగా మళ్లీ వారం రోజుల నుంచి చికెన్ అమ్మకాలు పెరిగాయని, షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News November 7, 2025
బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచండి: వరంగల్ మేయర్

బయోగ్యాస్ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్‌ను కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డిన, ఎంహెచ్ఓ డా.రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
దేవసేన, అధికారులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు: FATHI

TG: ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, సీఎం కార్యాలయ అధికారులపై తాము ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ‘FATHI’ అధ్యక్షుడు రమేశ్ Dy.CM భట్టితో చర్చల సందర్భంగా తెలిపారు. తమ కామెంట్స్‌ను వక్రీకరించారన్నారు. దీన్ని ఖండిస్తూ ఇప్పటికే ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. ఇక సమ్మె కారణంగా నిలిచిపోయిన పరీక్షలను వర్సిటీ అధికారులతో మాట్లాడి నిర్వహిస్తామని వెల్లడించారు.
News November 7, 2025
తెనాలి: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

తెనాలి చెంచుపేటలోని కోనేరు బజారులోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మధ్యాహ్నం ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులతో పాటు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. విటుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడని, నిర్వాహకురాలికి ఫోన్ ద్వారా నగదు చెల్లించిన ఆధారంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


