News March 9, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా

వరంగల్, హన్మకొండలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.160 నుంచి రూ.170 వరకు ధర పలకగా.. విత్ స్కిన్ కేజీ రూ.140, లైవ్ కోడి రూ.100 పలుకుతోంది. సిటీకి పల్లెలకు రూ.10-20 తేడా ఉంది. గత 2 వారాల క్రితం బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చాలా మంది మటన్, చేపల దుకాణాల వైపు మొగ్గుచూపగా మళ్లీ వారం రోజుల నుంచి చికెన్ అమ్మకాలు పెరిగాయని, షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
Similar News
News February 17, 2026
సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. నేడే తుది తీర్పు

2002లో <<18340301>>సంచలనం సృష్టించిన<<>> సినీ నటి ప్రత్యూష మృతి కేసులో నేడు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాలు చేస్తూ నిందితుడు సిద్ధార్థరెడ్డి వేసిన అప్పీల్, అతడికి శిక్ష పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజిని వేసిన పిటిషన్లపై తీర్పును గతేడాది నవంబర్‌లో SC రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో 24 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
News February 17, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 17, 2026
స్ కోచ్ చెన్నకేశవులకు కోనేరు హంపి ప్రశంసలు

విజయవాడలో నిర్వహించిన శాప్ లీగ్ మహోత్సవంలో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సందడి చేశారు. ఈ సందర్భంగా సీనియర్ నేషనల్ ఆర్బిటర్ అవార్డు గ్రహీత, చెవిటికల్లుకు చెందిన చెస్ కోచ్ గుజ్జర్లపూడి చెన్నకేశవులను ఆమె అభినందించారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలని కోరారు. కఠిన సాధనతోనే చదరంగంలో ఛాంపియన్‌లుగా ఎదగగలరని హంపి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.


