News March 1, 2025
వరంగల్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 35 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News December 18, 2025
వరంగల్ జిల్లాలో సింగిల్ డిజిట్లో గెలిచిన అభ్యర్థులు!

నర్సంపేట మండలం జీజీఆర్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి భూస నరసయ్య ఒక్క ఓటు తేడాతో గెలిచారు. 453 ఓట్లకు గాను 421 పోలై నరసయ్యకు 191, BRS అభ్యర్థి కుమారస్వామికి 190 ఓట్లు వచ్చాయి. ఖానాపురం మండలం అయోధ్యనగర్లో BRS అభ్యర్థి కూస విమల నాలుగు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెక్కొండ మండలం మడిపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆంగోత్ అనూష, అజ్మీరా మంగ్యానాయక్ తండాలో BRSఅభ్యర్థి మాలోత్ వెంకట్ స్వల్ప మెజార్టీతో గెలిచారు.
News December 17, 2025
గొల్లభామ తండా సర్పంచ్గా బాలు నాయక్

చెన్నారావుపేట మండలంలోని గొల్లభామ తండా గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన గుగులోతు బాలు నాయక్ విజయం సాధించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజలతో కలిసి ముందుకు సాగుతానని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News December 17, 2025
వరంగల్: 77.58 శాతం పోలింగ్ @1PM

వరంగల్ జిల్లాలో మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా వ్యాప్తంగా 77.58శాతం పోలింగ్ అయింది. చెన్నారావుపేట మండలంలో 84 శాతం, ఖానాపూర్లో 70.35, నర్సంపేటలో 82.16, నెక్కొండలో 75.4 శాతం పోలింగ్ అయినట్లు అధికారులు వెల్లడించారు.


