News March 10, 2025
వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News March 10, 2025
కేంద్రమంత్రి నాలిక అదుపులో పెట్టుకోవాలి: సీఎం స్టాలిన్

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ధర్మేంద్ర తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన నాలిక అదుపులో పెట్టుకోవాలి. ‘పీఎం శ్రీ’ పథకాన్ని మేమెప్పుడూ ఒప్పుకోలేదు. కానీ మేం ఒప్పుకుని మాట మార్చామంటూ ఆయన అవాస్తవాలు చెబుతున్నారు. మీరు తమిళనాడు విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తారా లేదా ముందు అది చెప్పండి’ అని ప్రశ్నించారు.
News March 10, 2025
రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.
News March 10, 2025
భద్రాద్రికొత్తగూడెం: రైల్వే బోర్డు ఛైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ

జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఆయన రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు కొత్త ప్లాట్‌ఫామ్‌లను విస్తరించడం, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్‌లు కొత్త రైళ్ల మంజూరుపై మాట్లాడారు.