News March 10, 2025
వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News March 10, 2025
భీమవరం: పీజీఆర్‌ఎస్‌కు 367 అర్జీలు

భీమవరం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి పీజీఆర్‌కు 367 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిని సంబంధిత అధికారులు పంపించి త్వరగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ తదితరులు పాల్గొన్నారు.
News March 10, 2025
NZB: జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి.శ్రీనివాస్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా డీపీఓగా ఉన్న ఈయనను ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ కార్యాలయం సిబ్బంది కొత్త డీపీఓకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ రావు జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
News March 10, 2025
అస్సాంకు సొంత ఉపగ్రహం

త్వరలో ‘అస్సాంశాట్’ అనే సొంత ఉపగ్రహాన్ని లాంఛ్ చేయనున్నట్లు అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ప్రకటించారు. సరిహద్దులపై నిఘాకు, కీలక సామాజిక-ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం ఈ శాటిలైట్‌ను వాడనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, వ్యవసాయానికి కూడా అది ఉపకరిస్తుందని వివరించారు. ప్రయోగం పూర్తైతే సొంత శాటిలైట్ ఉన్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.