News March 10, 2025
వరంగల్ జిల్లాలో ప్రమాదకరంగా SRSP

తీగరాజుపల్లి వద్ద గల SRSP కాలువలో పడి మేచరాజుపల్లికి చెందిన ముగ్గురు శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే తరహా ఘటన జరగడం రెండోసారి కావడంతో జిల్లా ప్రజలు భయపడుతున్నారు. జిల్లాలోని అక్కడక్కడ SRSP కాలువ పక్కన గల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రయాణికులు,స్థానికులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నామని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Similar News
News November 18, 2025
ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

ఐ-బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?
News November 18, 2025
రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.
News November 18, 2025
ఖైదీని మార్చిన పుస్తకం!

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.


