News March 5, 2025

వరంగల్ జిల్లాలో విషాదం.. యువకుడి ఆత్మహత్య

image

అప్పుల భారం భరించలేక పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ కథనం ప్రకారం.. మండలంలోని ఊకల్ హవేలీ గ్రామానికి చెందిన సాంబారి రాజు తన అవసరాల నిమిత్తం వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించలేక సోమవారం ఏదో పురుగుల మందు తాగగా వరంగల్ ఎంజీఎంకి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందగా మంగళవారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News March 6, 2025

WGL: 267 మంది ఆబ్సెంట్.. ఒక మాల్ ప్రాక్టీస్ కేస్

image

వరంగల్ జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం వరంగల్ జిల్లాలో 6,266 మొదటిరోజు 5,999 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 267 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. మొదటి రోజు ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తే పట్టుపడ్డారు.

News March 6, 2025

నెక్కొండ: యాక్సిడెంట్‌లో 9వ తరగతి విద్యార్థి మృతి

image

నెక్కొండలో జరిగిన యాక్సిడెంట్‌లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.  కాగా ఈ ఘటనలో తొమ్మిదో తరగతి విద్యార్థి మరణించినట్లు SI మహేందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నెక్కొండకు చెందిన మహమ్మద్ సాజిద్(16)మోడల్ స్కూల్‌లో చదువుతున్నాడు. స్కూల్ నుంచి మధ్యాహ్నం నెక్కొండకు స్కూటీపై వస్తున్నాడు. ఈ క్రమంలో CH సంతు బైక్‌పై నెక్కొండ నుంచి వెంకటాపురం వెళ్తూ వేగంగా స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో సాజిద్ మరణించాడు.

News March 5, 2025

WGL: శిరీష హత్య కేసులో కీలక మలుపు

image

HYD మలక్‌పేటలో జరిగిన వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. HNK జిల్లా పరకాలకు చెందిన శిరీష దోమలపెంటకు చెందిన వినయ్‌ని వివాహం చేసుకుంది. ఈ మేరకు శిరీషను వినయ్ సోదరి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరి ఆడకుండా చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో వినయ్, అతడి సోదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!