News July 30, 2024

వరంగల్ జిల్లాలో విష జ్వరాలు

image

ఉమ్మడి WGL జిల్లాలో విష జ్వరాలు పెరుగుతున్నాయి. పెద్దలు, పిల్లలతో కలిసి మొత్తం 1,300 పడకల వార్డులున్న MGMకు జిల్లాతో పాటు.. పొరుగు జిల్లాలు, AP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోగులు వస్తున్నారు. ప్రతిరోజు 50కి పైగా రోగులు ఆస్పత్రిలో చేరుతున్నారు. జులై నెలలలో ఇప్పటి వరకు PHCలలో 41,152 ఓపీ రోగులు రాగా.. 1,856జ్వరాలు, 29వాంతులు, విరేచనాలు, 6డెంగీ, 2మలేరియా కేసులు నమోదైనట్లు వైధ్యాధికారులు తెలిపారు.

Similar News

News December 1, 2024

నెక్కొండ: విఫలమైన ఆన్‌లైన్ ప్రేమ.. యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్‌లైన్‌లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

News December 1, 2024

ములుగు: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ

image

ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

News December 1, 2024

ప్రజాపాలన విజయోత్సవాల్లో WGL ఎమ్మెల్యే, HNK కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం నుంచి ప్రారంభమైన 2k రన్‌ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు.