News May 13, 2024
వరంగల్ జిల్లాలో 22.3 మి.మీ వర్షపాతం నమోదు

వరంగల్ జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం పడింది. గీసుగొండలో 61.9 మి.మీ, ఖానాపురంలో 61 మి.మీ, వరంగల్‌లో 59.8 మి.మీ, ఖిలా వరంగల్‌లో 43,5 మి.మీ, సంగెంలో 28.8 మి.మీ, దుగ్గొండిలో 25.3 మి.మీ, నర్సంపేటలో 10 మి.మీ వర్షం పడింది. జిల్లావ్యాప్తంగా సరాసరి 22.3 మి.మీ వర్షం కురిసింది. మొత్తంగా 292.3 మి.మీ వర్షం పడినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News April 24, 2025
మామునూరు ఎయిర్‌పోర్ట్ గురించి ఈ విషయాలు తెలుసా..?

WGL మామునూరు ఎయిర్‌పోర్ట్ను నిజాం పాలనలో 1930లో నిర్మించారు. జవహర్ లాల్ నెహ్రూతో సహా అనేకమంది ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు 1981 వరకు వారి పర్యటనలకు ఈ విమానాశ్రయం ఉపయోగపడింది. ఈ విమానాశ్రయం షోలాపూర్‌లో వ్యాపారాభివృద్ధికి, సిర్పూర్ కాగజనగర్‌లో కాగితం పరిశ్రమ సౌకర్యార్థం నిర్మించారు. ఇది బేగంపేట విమానాశ్రయం కంటే అతి పురాతనమైంది. మామూనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
News April 24, 2025
వరంగల్‌లో గురువారం మెగా జాబ్ మేళా

వరంగల్ జిల్లాలో గురువారం మెగా జాబ్ మెళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిని రజిత తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ కళాశాలలో గల ఎంప్లాయిమెంట్ ఆఫీసుకు రావాలన్నారు. పూర్తి వివరాలకు 7093168464 సంప్రదించాలని కోరారు.
News April 23, 2025
అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తాం: మంత్రి సీతక్క

నర్సంపేట నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని మంత్రి సీతక్క అన్నారు. కొత్తగూడలో వివిధ కార్యక్రమాలకు వెళ్తున్న మంత్రి మార్గమధ్యలోని ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఆగారు. స్థానిక నాయకులతో మంత్రి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. వరంగల్ డీసీసీ అధికార ప్రతినిధి రవీందర్ రావు, తదితరులున్నారు.