News February 27, 2025
వరంగల్ జిల్లాలో 46.81% ఓటింగ్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ శాతం మెరుగుపడింది. 12 గంటల వరకు 46.81 శాతం అధికారులు వెల్లడించారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లు ఉండగా, 1101 ఓట్లు పోలింగ్ అయ్యాయి. వద్దన్నపేట 54.35, రాయపర్తి 57.58, నెక్కొండ 74.65, ఖానాపూర్ 54.79, నర్సంపేట 51.2, చెన్నారావుపేట 52.54, పర్వతగిరి 53.85, సంగెం 56.06, నల్లబెల్లి 52.35, దుగ్గొండి 35, గీసుకొండ 65.56, వరంగల్ 41.58, కిల్లా వరంగల్ 40.9 నమోదయింది.
Similar News
News February 28, 2025
ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు : WGL కలెక్టర్

ఖమ్మం వరంగల్ నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఓటు హక్కు కలిగిన ఉపాధ్యాయులు ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు. జిల్లాలో మొత్తం 2,352 మంది ఓటర్లకు 94.13 శాతం ఓటేశారని పేర్కొన్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా బ్యాలెట్ పత్రాలను భారీ బందోబస్తు మధ్య నల్గొండ జిల్లాకు తరలించారని తెలిపారు.
News February 27, 2025
వరంగల్: ముగిసిన పోలింగ్.. 94 శాతం పోలింగ్

ఉమ్మడి వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. వరంగల్ జిల్లాలో మొత్తం 2352 ఓట్లకు 2214మంది ఉపాధ్యాయులు ఓటేశారు. మొత్తంగా 94.13 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
News February 27, 2025
వరంగల్: మధ్యాహ్నం 2గంటల వరకు 75.64% పోలింగ్

వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 75.64 శాతం పోలింగ్ నమోదైనట్లు ఉపాధ్యాయ ఎన్నికల అధికారి తెలిపారు. వరంగల్ జిల్లాలో మొత్తం 2,352 ఓట్లకు మధ్యాహ్నం 2గంటల వరకు 1,779 ఓట్లు పోలైనట్లు చెప్పారు. 13మండలాల్లో 13 చొప్పున పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.