News July 20, 2024
వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపిన నేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సత్య శారదా దేవి తెలిపారు. వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3434, 9154252936 లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లో 24 గంటలు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు.
Similar News
News October 12, 2024
హనుమకొండ: జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
విజయానికి చిహ్నమైన విజయదశమిని జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దసరా పండుగ రోజున ప్రజలందరూ ఒకరినొకరు కలుసుకొని సుఖసంతోషాలతో శమీ పూజ నిర్వహించి ఐకమత్యంగా పండుగను జరుపుకోవాలన్నారు. సుఖసంతోషాలతో ఉండేలా ఆ దుర్గాదేవి అందరిని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.
News October 11, 2024
హనుమకొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: స్టేట్ హెల్త్ డైరెక్టర్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అందు కోసం డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతో పని చేయాలని రాష్ర్ట ఆరోగ్యశాఖ సంచాలకులు (డైరెక్టర్) బి.రవీందర్ నాయక్ పేర్కొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లాలోని పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆసుపత్రి పరిధిలో నమోదైన డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధుల గురించి తెలుసుకున్నారు.
News October 11, 2024
వరంగల్: పండగ వేళ.. జాగ్రత్త!
జిల్లాలో పండగ పూట రోడ్డు ప్రమాదాలు కుటుంబీకులను కంటతడి పెట్టిస్తున్నాయి. రాయపర్తి మండలం కిష్టపురానికి చెందిన <<14329203>>అన్వేశ్(19), రాజు(24)<<>>, చెన్నారావుపేట(M) ఉప్పరపల్లికి చెందిన <<14330918>>గుల్లపల్లి అఖిల్<<>>, వాజేడు మండలం చెరుకూరుకు చెందిన <<14328812>>భూపతి<<>>.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి కుటుంబాలను రోడ్డున పడేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.