News December 3, 2024
వరంగల్: జూ పార్కుకు రెండు పెద్ద పులులు

హనుమకొండ హంటర్ రోడ్‌లోని కాకతీయ జూ పార్కుకు జిల్లా అటవీ శాఖ అధికారులు రెండు పెద్ద పులులను తీసుకొచ్చారు. హైదరాబాదులోని నెహ్రూ జులాజికల్ పార్కు నుంచి తీసుకొచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే జూపార్కులో చిరుత, ఎలుగు బంట్లు, జింకలు, నెమళ్లు ఇతర పక్షులు, జంతువులు ఉండగా.. ఇప్పుడు ఈ పెద్దపులులను తీసుకురావడంతో జూ పార్కుకు సందర్శకుల తాకిడి పెరగనుంది.
Similar News
News November 2, 2025
వరంగల్: హైదరాబాద్ బయలుదేరిన బీసీ సంఘం నేతలు

హైదరాబాద్‌లో జరగనున్న బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి వరంగల్ జిల్లాలోని బీసీ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బయలుదేరారు. వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బీసీ జేఏసీ ఛైర్మన్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్ర స్థాయిలో ఐక్యత అత్యవసరమన్నారు. ఈ సమావేశం చారిత్రాత్మకంగా నిలవబోతుందని పేర్కొన్నారు.
News November 1, 2025
వరంగల్: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. అయితే, కృతిమ గర్భం ద్వారా మేలు జాతి రకాలైన దూడలు జన్మిస్తాయని, కృత్రిమ ఏఐ ద్వారా ఈ దూడలు జన్మించాయని గోపాల మిత్ర డా.అక్బర్ పాషా తెలిపారు. దీంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.
News October 30, 2025
WGL వాయిదాపడిన ఎస్ఏ-1 పరీక్షలు

అక్టోబర్ 24 నుంచి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో సమ్మెటివ్ అసెస్మెంట్-1 నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలతో బుధవారం మధ్యాహ్నం, గురువారం ఉదయం, మధ్యాహ్నం నిర్వహించాల్సిన పరీక్షలు పోస్ట్‌పోన్ అయ్యాయి. వాయిదా పడిన ఈ పరీక్షలను నవంబర్ 1, నవంబర్ 3 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు డీఈవో బి.రంగయ్య నాయుడు పేర్కొన్నారు.


