News March 20, 2025
వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి జరిమానా

వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరిచారు. 21 మందిని వరంగల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ అబ్బోజు వెంకటేశం ముందు హాజరు పరచగా.. వారికి రూ.20,600 జరిమానా విధించారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో నలుగురికి రెండు వేల జరిమానా విధించినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.
Similar News
News March 31, 2025
పెద్దమ్మ తల్లి బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ

పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరు బాగుండాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఖిలా వరంగల్ తూర్పు కోట పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉగాది పండుగ సందర్భంగా జరిగే జాతరలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధులుగా పాల్గొని ఎడ్ల బండిపై గుడి చుట్టూ ప్రదర్శన చేశారు. అనంతరం పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.
News March 30, 2025
వరంగల్: నేడు, రేపు.. అవి తెరిచే ఉంటాయి!

వరంగల్ మహా నగర పాలక సంస్థ పన్నుల వన్ టైమ్ సెటిల్మెంట్ చెల్లింపు కోసం నేడు(ఆదివారం), రేపు(సోమవారం) మీ సేవా కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ కేంద్రాలు తెరిచే ఉండనున్నాయి. వన్ టైమ్ సెటిల్మెంట్ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ప్రజల కోసం ఈ అవకాశాన్ని కల్పించినట్లు గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. పాత బకాయిలపై 90 శాతం వడ్డీ రాయితీ మినహాయింపు పొందాలన్నారు.
News March 30, 2025
WGL: కొత్త సంవత్సరం.. స్థానిక సమరం!

స్థానిక సంస్థల ఎన్నికల ఆశావహులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రాజకీయ భవిష్యత్ను తేల్చనుంది. వరంగల్ జిల్లాలో సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఈ తెలుగు నూతన సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు ఈ ఏడాది నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన రాజకీయ ఆశావహులకు ఈ ఏడాది ‘ కీ ‘ రోల్ కాబోతుంది.