News February 13, 2025

వరంగల్: తగ్గిన మక్కల ధర.. పల్లికాయ ధరలు ఇలా!

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కల ధర మళ్లీ తగ్గింది. మంగళవారం రూ.2,370 పలికిన మక్కలు(బిల్టీ) ధర బుధవారం మరింత తగ్గి రూ.2,355కి చేరింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,350కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే.. క్వింటా సూక పల్లికాయ ధర రూ.6,410 పలకగా.. పచ్చి పల్లికాయ రూ.4,900 పలికిందని పేర్కొన్నారు.

Similar News

News December 3, 2025

సమంత-రాజ్.. కొత్త ఫొటోలు చూశారా?

image

హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. సమంత మెహిందీ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఆమె నవ్వుతూ చేతులు చూపిస్తుండగా, రాజ్ ఫొటోలు తీశారు. సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు వీటిని SMలో పోస్ట్ చేశారు. ‘సమంత.. ఈ పెళ్లితో నీలో కొత్త రకమైన సంతోషాన్ని చూస్తున్నా. మీరిద్దరూ ఇలాగే కలకాలం కలిసుండాలి’ అని పేర్కొన్నారు.

News December 3, 2025

BREAKING విశాఖ: స్పా సెంటర్‌పై దాడి.. ఐదుగురు అరెస్ట్

image

గాజువాక 80 ఫీట్‌ల రోడ్డులోని ఓ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడు, ఆర్గనైజరు, మేనేజర్, ఇద్దరు మహిళలను సిటీ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గాజువాక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని టాస్క్ఫోర్స్ సీఐ అప్పలనాయుడు ప్రజలను కోరారు.

News December 3, 2025

రైతన్న మీకోసం వర్క్ షాప్‌లో కలెక్టర్

image

పెదపాడు మండలం అప్పన్నవీడులో బుధవారం రైతన్న మీకోసం వర్క్‌షాప్ జరిగింది. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఎక్కువ విస్తీర్ణంలో సాగు అయ్యేందుకు కృషి చేయాలని అన్నారు. సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించాలని తెలిపారు.