News November 8, 2024
వరంగల్: తగ్గిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నేడు మొక్కజొన్న తరలివచ్చింది. ధర మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురువారం రూ.2,470 పలికిన క్వింటా మొక్కజొన్న నేడు రూ.2,450కి పడిపోయింది. 2 నెలల క్రితం 3వేలకు పైగా పలికిన మక్కల ధర క్రమంగా తగ్గింది. మరోవైపు 5,531 రకం మిర్చికి నిన్నటిలాగే నేడు రూ.13 వేల ధర వచ్చింది.
Similar News
News November 27, 2025
Te-Poll యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.
News November 27, 2025
వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.