News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News November 24, 2025
GWL: ప్రజావాణిలో ఎస్పీకి 16 ఫిర్యాదులు వెల్లువ

గద్వాల జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాసరావు నేరుగా 16 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో పొలానికి సంబంధించినవి 7, గొడవలకు 2, భర్త హరాస్మెంట్కు 2, ప్లాట్ ఇష్యూ, దొంగతనానికి సంబంధించినవి ఒక్కొక్కటి ఉన్నాయి. బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ సంబంధిత అధికారులను ఆదేశించారు.
News November 24, 2025
ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన

ఖమ్మం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల హాస్టల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు సోమవారం రాత్రి ఆందోళనకు దిగారు. సుమారు 250 మంది విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని, క్యాంపస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. లక్షల ఫీజులు చెల్లించినా రుచిలేని భోజనం పెడుతున్నారని, ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
News November 24, 2025
SRCL: ‘ప్రజల సమస్యల పరిష్కారమే గ్రీవెన్స్ డే లక్ష్యం’

బాధితుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఆయన ప్రజల నుంచి 32 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యమని, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నట్లు ఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.


