News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News December 9, 2025
ఇండియాస్ హాకీ విలేజ్ గురించి తెలుసా?

14 మంది ఒలింపియన్లు సహా 300 మంది హాకీ ప్లేయర్లను ఇచ్చింది పంజాబ్ జలంధర్ దగ్గరలోని సన్సర్పూర్. హాకీని సంస్కృతిగా చూశారు గనుకే ఒక ఒలింపిక్స్లో ఐదుగురు ఇండియాకు, ఇద్దరు హాకీ ప్లేయర్లు కెన్యాకు ఆడారు. హాకీనే ఊపిరిగా తీసుకున్న ఆ గ్రామ వైభవాన్ని వసతుల లేమి, వలసలు మసకబార్చాయి. టర్ఫ్ గ్రౌండ్స్, అకాడమీలు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుతో సన్సర్పూర్కు పునర్వైభవం తేవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
News December 9, 2025
పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యం: భట్టి

TG: తెలంగాణ రైజింగ్ కోసం తమ ప్రభుత్వం నియంత్రించేదిగా కాకుండా ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘TG ఇన్నోవేషన్ క్యాపిటల్ కావాలంటే ‘ఈజ్ ఆఫ్ ఇన్నోవేటింగ్’ వైపు సాగాలి. ఉత్పాదకత పెంపే తెలంగాణ సాధారణ పౌరుడి వేతనాలు, గౌరవాన్ని శాశ్వతంగా పెంచే ఏకైక మార్గం. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పత్రం కాదు ప్రతిజ్ఞ’’ అని వివరించారు. పెట్టుబడులకు ఆవిష్కరణలు తోడైతేనే $3T ఎకానమీ సాధ్యమన్నారు.
News December 9, 2025
పిట్లం: ఎన్నికల విధులకు సిద్ధంకండి: సబ్ కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, పిట్లంలో మంగళవారం ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఆమె సిబ్బందికి ఎన్నికల నియమాలు, ఓటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపుపై స్పష్టమైన ఆదేశాలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆమె సిబ్బందికి సూచించారు.


