News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News April 10, 2026
సిరిసిల్ల: నిబంధనలకు అనుగుణంగా అర్జీలు పరిష్కరించాలి

నిబంధనలకు అనుగుణంగా అర్జీలు పరిష్కరించాలని సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్‌లో భూభారతి రెవిన్యూ నీటిపారుదల సర్వే అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూభారతి సాదా బైనమా కింద వచ్చిన అర్జీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు. జిల్లాలోని చెరువులు, రిజర్వాయర్లు ప్రాజెక్టులు వెట్ లాండ్స్ కిందికి వస్తాయన్నారు.
News April 10, 2026
రోడ్డు భద్రతపై గ్రామసభలు నిర్వహించాలి: ఎస్పీ

జిల్లాలో ఈ నెల 13న అన్ని గ్రామాల్లో రోడ్డు భద్రత గ్రామసభలు, ర్యాలీలు నిర్వహించాలని ఎస్పీ నరసింహ ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ప్రతిజ్ఞ చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ నిబంధన అమలు చేయాలని, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తేజస్ ధాన్యం కొనుగోలుపై చర్చించారు.
News April 10, 2026
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే, ఇండస్ట్రియల్ పార్కులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


