News February 5, 2025

వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

image

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.

Similar News

News December 2, 2025

ASF: గుర్తులు రెఢీ.. రేపే ఉపసంహరణకు చివరి రోజు

image

ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. ఉపసంహరణ తర్వాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. సర్పంచ్ స్థానానికి 30, వార్డు సభ్యులకు 20కి పైగా గుర్తులు కేటాయించారు. సర్పంచ్ కు గులాబీ బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుపు బ్యాలెట్ ను నిర్ణయించారు. ఆల్ఫాబెటికల్‌గా గుర్తులను కేటాయిస్తారు. ఏ గుర్తు ఎవరికి వస్తుందని చర్చించుకుంటున్నారు.

News December 2, 2025

NGKL: అధికార పార్టీకి ‘రెబల్స్’ టెన్షన్..!

image

NGKL జిల్లాలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ (కాంగ్రెస్) అభ్యర్థులకు రెబల్స్ బెడద పట్టుకుంది. జిల్లాలోని అనేక గ్రామాల్లో పార్టీకి చెందిన నాయకులే రెబల్‌గా నామినేషన్లు వేయడంతో వారిని ఉపసంహరించుకునేలా చేయడానికి నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు పోటీ చేస్తుండడం అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు రేపు చివరి రోజు గడువు ఉంది.

News December 2, 2025

కరీంనగర్: మమ్మల్ని కాస్త ‘గుర్తు’పెట్టుకోండి..!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేడి పెరిగి ప్రచార జోరు సాగుతోంది. గ్రామాల్లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్ల వద్దకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వెయ్యాలని అభ్యర్థిస్తున్నారు. గుర్తులు లేకున్నా ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘గుర్తులు వచ్చాక చెప్తాం కానీ.. మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆశీర్వదించండి’ అంటూ వేడుకుంటున్నారు. దీంతో గ్రామాల్లో పాలిటిక్స్ ఓ పీక్‌లో సాగుతున్నాయి.