News February 28, 2025

వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

image

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.

Similar News

News March 1, 2025

వరంగల్‌కు ఎయిర్‌పోర్టు.. రివ్వున ఎగరనున్న విమానాలు

image

మామునూర్ ఎయిర్ పోర్టుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓరుగల్లు ప్రజల ఏళ్లనాటి ఆకాంక్ష నెరవేరబోతోంది. ఇప్పటికే 696 ఎకరాల భూమిని సేకరించగా.. మరో 253 ఎకరాల భూమిని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల రైతుల నుంచి సేకరిస్తున్నారు. దీనికోసం రూ.205 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో విమానాలు నడిపేందుకు ఇప్పుడున్న 1.8 కి.మీ రన్‌వేను 3.9కి.మీలకు పెంచాల్సి ఉంది. మీ కామెంట్

News March 1, 2025

వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు 

image

మార్చ్ 5వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం జనరల్ 4,967, ఒకేషనల్ 848 మొత్తం 4,815 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 5,739, ఒకేషనల్ 767 మంది మొత్తం 6,506 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News March 1, 2025

వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: వరంగల్ డీఐఈవో

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించడానికి పరీక్షా కేంద్రాల సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డా.శ్రీధర్ సుమన్ అన్నారు. మార్చి 5నుంచి నిర్వహించబోయే ఇంటర్ వార్షిక పరీక్షలపై శుక్రవారం లాల్ బహదూర్ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు సమావేశం నిర్వహించారు.

error: Content is protected !!