News February 28, 2025
వరంగల్: దశాబ్ద కాలం కోరిక నెరవేరింది: మంత్రి సురేఖ

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నెరవేరిందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సీఎం రేవంత్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు.
Similar News
News November 16, 2025
రైలు ఢీకొని విద్యార్థి మృతి

కడప రైల్వే స్టేషన్‌లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని మహేశ్ (21) MBA విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మహేశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలోని అన్నమాచార్య కాలేజీలో చదువుతున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News November 16, 2025
జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయం: మంత్రి కోమటిరెడ్డి

సమాజ సమస్యలను ధైర్యంగా ప్రజల ముందుకు తెస్తూ, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్న జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎక్స్‌పీరియం ఎకో పార్కులో జరిగిన జర్నలిస్టుల కుటుంబాల గెట్-టు-గెదర్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్న మీడియా మిత్రుల పట్ల తనకు గౌరవం, కృతజ్ఞతలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
News November 16, 2025
1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

అర్జీదారులు ‘మీ కోసం కాల్ సెంటర్ 1100’ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్‌ను సంప్రదించవచ్చని సూచించారు.


