News January 11, 2025

వరంగల్: నకిలీ వైద్యులున్నారు.. పారా హుషార్..!

image

ఉమ్మడి WGL జిల్లాలో నకిలీ డాక్టర్ల వైద్యం ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. NSPTలో పిల్లలు పుట్టేందుకు నకిలీ వైద్యుడి ట్రీట్మెంట్‌తో  ఓ మహిళ అస్వస్థతకు గురికాగా స్థానికులు పట్టుకున్నారు. ఇలానే.. WDPTలో ఒక ఆటో కార్మికుడు, WGLలో ఆపరేషన్ చేస్తూ ఒకరు, CHPTలో హెర్బల్ మందుల పేరుతో మహిళ మృతి చెందిన ఘటనలు జరిగాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో సుమారు 60కి పైగా నకిలీలను గుర్తించారు.

Similar News

News October 27, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..!

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో సోమవారం మిర్చి బస్తాలు భారీగా తరలివచ్చినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి క్వింటాకు రూ.16 వేలు, వండర్ హాట్ (WH) మిర్చి రూ.16,600 పలికింది. అలాగే తేజ మిర్చి ధర రూ.14,100, దీపిక మిర్చి రూ.15 వేలు పలికింది. మక్కలు(బిల్టీ)కి రూ.2050 ధర వచ్చింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.

News October 27, 2025

డీసీసీ పీఠం పర్వతగిరికి దక్కేనా..?

image

జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పీఠం పర్వతగిరికి దక్కుతుందా? అని శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియను అధిష్ఠానం ప్రారంభించిన నేపథ్యంలో పర్వతగిరి మండలం నుంచి ఇరువురు వ్యక్తుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏనుగల్లు గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ కన్వీనర్ బొంపెల్లి దేవేందర్ రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు ఉన్నారు.

News October 26, 2025

సోమవారం ‘ప్రజావాణి’ రద్దు: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం(అక్టోబర్‌ 27) నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సోమవారం కలెక్టరేట్‌కు రావద్దని ఆమె సూచించారు.