News March 7, 2025
వరంగల్ నగరంలో పోలీసుల పుట్ పెట్రోలింగ్

నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు భరోసా కల్పించే దిశగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వరంగల్ డివిజినల్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ నేతృత్వం పోలీసులు మండిబజార్, చార్ బోలి ప్రాంతాల్లో పుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు.
Similar News
News November 18, 2025
‘వారణాసి’ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ టైటిల్ రివీల్ ఈవెంట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. 130 అడుగుల ఎత్తైన LED స్క్రీన్, సీటింగ్, ఇతరత్రాలకు భారీగానే వెచ్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీడియో రిలీజ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో <<18300800>>రాజమౌళి<<>> ఆవేదనలో మాట్లాడినట్లు తెలుస్తోంది.

పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించండి: మంత్రి తుమ్మల

ఖమ్మం: జిన్నింగ్ మిల్లులు తమ సమ్మెను తక్షణమే విరమించి, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పత్తి కొనుగోళ్లు పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కోరారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి, తేమ నిబంధనలపై కేంద్రం సమీక్షించి, సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మిల్లుల సమస్యలను CCIతో చర్చించి పరిష్కరిస్తామని తుమ్మల భరోసా ఇచ్చారు.