News September 3, 2024

వరంగల్ నగరం.. ‘భద్రకాళి చెరువు’తో భయం భయం?

image

వరదలొస్తేనే కాని అధికారులకు చెరువులు, నాలాలు గుర్తుకురావని WGL నగర ప్రజలు మండిపడుతున్నారు. ఏడాది నుంచి భద్రకాళి చెరువు కట్టను ఎవరూ పట్టించుకోలేదని, ప్రస్తుతం చెరువు నిండుకుండలా మారిందన్నారు. పోతననగర్ వైపు చెరువు కట్ట బలహీనంగా మారడంతో దిగువన ఉన్న కాలనీ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆదివారం కలెక్టర్ ప్రావీణ్య చెరువు కట్టను పరిశీలించి అధికారులపై మండిపడటంతో ఇసుక బస్తాలను నింపుతున్నట్లు సమాచారం.

Similar News

News September 14, 2024

దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయింది: సీతక్క

image

దేశం ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి మంత్రి సీతక్క పూలమాల వేసి నివాళులర్పించారు. భారతీయ రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తిగా సీతారాం ఏచూరి గుర్తింపు పొందారని, దశాబ్దాలుగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతూ భారత కమ్యునిస్టు రాజకీయాలపై చెరగని ముద్రవేసుకున్న ప్రజా ఉద్యమకారుడు సీతారాం ఏచూరి అని అన్నారు.

News September 13, 2024

జనగామ: పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించాలి: కలెక్టర్

image

జనగామ కలెక్టర్ కార్యాలయంలో సీడీపీఓలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లతో ఎస్ఎస్ఎఫ్పీ కార్య నిర్వహణపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో టీచర్లు పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల్ని గుర్తించి, ప్రతి 15 రోజులకోసారి సరైన పద్ధతిలో బరువులు, ఎత్తు కొలతలను తీసి ఆన్‌లైన్‌లో సరైన విధంగా నమోదు చేయాలన్నారు. సీడీపీఓలు రమాదేవి, మహేశ్ తదితరులున్నారు.

News September 13, 2024

అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: ఎమ్మెల్సీ

image

MHBD: బీఆర్ఎస్ ముఖ్య నేతల అక్రమ అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. నిన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రశ్నించే వారిపై ఆంక్షలు విధించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం కొట్లాడుతూనే ఉంటామన్నారు.