News February 18, 2025

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు: టీకే శ్రీదేవి

image

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టరేట్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  భారత ప్రభుత్వం ‘పీఎం ఈ-బస్‌ సేవా పథకం’లో భాగంగా వరంగల్‌ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్‌ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు తెలిపారు.

Similar News

News October 17, 2025

వరంగల్: పంటల కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష

image

ధాన్యం, పత్తి, మక్క పంటల కొనుగోలు ప్రక్రియపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్షించారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని, కేంద్రాల సౌకర్యాలు, తూక యంత్రాలు, గోదాములు, సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.

News October 15, 2025

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ల్యాండ్ ఆక్విజిషన్‌పై సమీక్ష

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జీ పనుల ల్యాండ్ ఆక్విజిషన్ పురోగతిపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి, డీఆర్వో విజయ లక్ష్మి, ఆర్డీఓ నర్సంపేట ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్యతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 15, 2025

చెక్ లిస్టులు సరి చూసుకోవాలి: డీఐఈఓ

image

జిల్లాలోని ఇంటర్ విద్యార్థుల పూర్తి వివరాలను “ఆన్లైన్ చెక్ లిస్టు”లతో సరి చూసుకోవాలని DIEO శ్రీధర్ సుమన్ అన్నారు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ప్రథమ, ద్వితీయ సం. విద్యార్థులు తమ వివరాలను సరి చూసుకునే సౌకర్యం కల్పించారని, విద్యార్థులు https://tgbie.cgg.gov.in/svc.do లింకు ద్వారా నేరుగా తమ వివరాలు పరిశీలించుకోవచ్చన్నారు.