News February 18, 2025

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు: టీకే శ్రీదేవి

image

వరంగల్ నగరానికి 100 ఎలక్ట్రిక్‌ బస్సులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదిక సమర్పించాలని రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ అండ్‌ డైరెక్టరేట్‌ డాక్టర్‌ టీకే శ్రీదేవి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ‘పీఎం ఈ-బస్‌ సేవా పథకం’లో భాగంగా వరంగల్‌ నగరానికి జనాభా ప్రాతిపదికన 100 ఎలక్ట్రిక్‌ బస్సులను నిర్వహణ కోసం బల్దియాకు అందజేయనున్నట్లు తెలిపారు.

Similar News

News December 13, 2025

తిరుమల కల్తీ నెయ్యి.. నిందితులు ఏం చెప్పారు.?

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ16 అజయ్ కుమార్ సుగంధ్, ఏ29 సుబ్రహ్మణ్యం కస్టడీ శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు కల్తీ నెయ్యి ట్యాంకులు ఎలా వచ్చాయి, ఎవరెవరు వచ్చే వాళ్లు, వారు మీతో ఎలా స్పందించే వారిని ప్రశ్నించారని తెలుస్తోంది. ఏ16 కూడా శుక్రవారం అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారని సమాచారం. కాగా వైద్య పరీక్షలు అనంతరం వారిని నెల్లూరు జైలులో అప్పగించారు.

News December 13, 2025

డ్రీం ఫీడింగ్ గురించి తెలుసా?

image

డెలివరీ తర్వాత పిల్లలు చాలాకాలం రాత్రిళ్లు లేచి ఏడుస్తుంటారు. అయితే దీనికి డ్రీం ఫీడింగ్ పరిష్కారం అంటున్నారు నిపుణులు. డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలోనే బిడ్డకు పాలివ్వడం. ముందు బేబీ రోజూ ఒకే టైంకి పడుకొనేలా అలవాటు చెయ్యాలి. తర్వాత తల్లి నెమ్మదిగా బిడ్డ పక్కన పడుకుని బిడ్డకు చనుబాలివ్వాలి. ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల బిడ్డ రాత్రంతా మేలుకోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

News December 13, 2025

మరీ కాకతీయ సంగతేందీ..?

image

ఎందరినో మేధావులుగా చేసిన కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న వర్సిటీ మలిదశ ఉద్యమానికి ఊపిరీలూదింది. KU కేంద్రంగా రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాయి. BRS హయాంలో నిధులు రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియాకు రూ.వేయి కోట్లు విడుదల చేయగా, KUకి కూడా రూ.వేయి కోట్లు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు.దీనిపై మీ కామెంట్?