News May 7, 2024
వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: కావ్య
వరంగల్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, వరంగల్ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య తెలిపారు. వరంగల్ జిల్లా కేంద్రంలో రాత్రి కడియం కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదని, పనులు చేసి చూపించే పార్టీ అని కడియం కావ్య అన్నారు.
Similar News
News January 17, 2025
జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ శబరీష్
ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర జరగనుంది. ఈ సందర్భంగా మేడారంలోని పార్కింగ్ స్థలాలు, వాహనాల రద్దీకి అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లును ఎస్పీ శబరిష్ పరిశీలించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దొంగతనాల నివారణకు, ప్రమాదాల నివారణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ శబరిష్ సూచనలు చేశారు.
News January 17, 2025
డ్రగ్స్ వ్యతిరేక ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండా
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.
News January 17, 2025
వరంగల్ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నట్లు మార్కెట్ సెక్రటరీ నిర్మల తెలిపారు. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.