News February 28, 2025

వరంగల్: నర్సంపేటలో విషాదం.. BRS నేత మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాణాల రాంబాబు శుక్రవారం గుండెపోటుతో మృతిచెందాడని స్థానికులు తెలిపారు. రాంబాబు భార్య ఇందిర 23వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. రాంబాబు మృతిపై స్థానికులు, పట్టణ బీఆర్ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ఆయనకు నివాళులర్పించారు.

Similar News

News December 10, 2025

భవానీ దీక్షల విరమణ.. భద్రత కట్టుదిట్టం: సీపీ

image

విజయవాడ భవానీ దీక్షల విరమణ కార్యక్రమాల నేపథ్యంలో సీపీ రాజశేఖర్ బాబు హోల్డింగ్ ఏరియాలు, సీసీ కెమెరాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్న దీక్షా విరమణ, మహా పూర్ణాహుతి దృష్ట్యా బందోబస్తుకు వచ్చిన అధికారులకు విధులపై దిశానిర్దేశం చేశారు. సీతమ్మ వారి పాదాల వద్ద, మున్సిపల్ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన హోల్డింగ్ ఏరియాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు.

News December 10, 2025

‘బాపట్లలో ప్రాంతీయ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి’

image

బాపట్లలో ప్రాంతీయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కోరారు. బుధవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి వినత పత్రం అందించారు. శిక్షణా సంస్థ ద్వారా ఆయుష్ విధానాలపై శిక్షణ, ఆయుష్ వైద్య విద్యను బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలో యోగ, ఆయుష్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.

News December 10, 2025

పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో MP బాలయోగి

image

పార్లమెంట్‌లోని సీబ్లాక్‌లో జరిగిన కార్మిక, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి స్టాండింగ్ కమిటీ సమావేశంలో అమలాపురం MP గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈసమావేశంలో వలస కార్మికుల నైపుణ్య, భాషా శిక్షణ, PMKVY 4.0 పురోగతి వంటి అంశాలపై సమీక్ష జరిగింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’ ‘డ్రాఫ్ట్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్’ను కమిటీ ఆమోదించింది.